మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం భోళా శంకర్ కేవలం 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్ల ద్వారా బజ్‌ను సృష్టిస్తోంది. ఇక సినిమా తమిళ వేదళం కు రీమేక్ కావడం, దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ వైఫల్యాల గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ మార్కెట్ లో బిజినెస్ అయితే గట్టిగానే చేసినట్లు తెలుస్తోంది. ఇక USA లో ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్‌లు బలంగా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఇక నిర్మాతలు థియేట్రికల్ వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక మరికొన్ని వేర్వేరు ఏరియాలలో థియేట్రికల్ హక్కులు విక్రయించబడ్డాయి. సెడెడ్‌లో 13 కోట్లు, ఇక ఆంధ్రా బిజినెస్ 37 కోట్లు, నైజాం 25 కోట్లు, అలాగే ROI+ ఓవర్సీస్ వ్యాపారం దాదాపు 15 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఫలితంగా మొత్తం 90 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోయే ఈ సినిమా 100 కోట్ల షేర్ అందుకుంటుందో లేదో చూడాలి.
Follow
Post a Comment