తమిళ దర్శకుడు శంకర్ తన ప్రతి సినిమాలో ప్రతి ఎపిసోడ్ కూడా చాలా గ్రాండ్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా పాటల విషయంలో కూడా అతని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్ హీరోగా గేమ్ చెంజర్ సినిమాలో కూడా శంకర్ నెవర్ బిఫోర్ అనేలా సాంగ్స్ ను హైలెట్ చేయబోతున్నాడట.
ఇప్పటికే కంపోజింగ్ అయిపోయింది. అలాగే సాంగ్స్ షూటింగ్ కూడా అయిపోయింది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉండబోతున్నాయి. ఇక అందులో ఒక్కో పాటకు ఒక్కో కొరియోగ్రాఫర్ వర్క్ చేశారు. టాప్ కొరియోగ్రాఫర్స్ అయినటువంటి ప్రభుదేవా గణేష్ ఆచార్య జానీ మాస్టార్ ప్రేమ్ రక్షిత్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఈ సాంగ్స్ కు తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.
సాంగ్స్ కోసమే నిర్మాత దిల్ రాజు చేత శంకర్ దాదాపు 90 కోట్లు ఖర్చు చేయించాడు. ఇక పాటలు ఎంత గ్రాండ్ గా తీసిన కూడా మ్యూజిక్ ఆడియన్స్ కు కనెక్ట్ కాకపోతే ఆ డబ్బు మొత్తం కూడా వృధా అయిపోయినట్లే. ముందు సాంగ్స్ అంచనాలను పెంచేలా ఉండాలి. అయితే ఇటీవల కాలంలో థమన్ చాలా బిజీగా కనిపిస్తున్నాడు కానీ అతని మ్యూజిక్ మాత్రం క్లిక్ కావడం లేదు. మరి గేమ్ ఛేంజర్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందించి ఉంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.
Follow
Follow
Post a Comment