బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమి క్రియేట్ కాలేదు. విడుదలైన ట్రైలర్ కూడా చాలా రొటీన్ గానే ఉంది అని బోయపాటి రెగ్యులర్ స్టైల్ లోనే ఈ సినిమా ఉండబోతున్నట్లు కొన్ని కామెంట్స్ అయితే వినపడుతున్నాయి.
అయితే నెగటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నా కూడా సినిమాకు రావాల్సినంత లాభాలు అయితే విడుదలకు ముందే వస్తున్నట్లుగా తెలుస్తోంది. చిత్ర నిర్మాతకు ఇప్పటికే నాన్ థియేట్రికల్ గా దాదాపు 85 కోట్ల వరకు అందినట్లు సమాచారం. ఈ సినిమా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కు సంబంధించిన అన్ని ఓటీటీ శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక హిందీ సాటిలైట్ హక్కుల నుంచి 35 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఆడియో హక్కుల నుంచి ఈ సినిమా మరో 5 కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చూసుకుంటే మొత్తంగా 85 కోట్ల వరకు ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ అందించినట్లు తెలుస్తోంది. ఇక 60 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఆ రూట్లో ఎంత వెనక్కి వస్తాయో చూడాలి.
Follow
Post a Comment