సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన 7/G బృందావన కాలనీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అప్పటి యూత్ అయితే ఈ చిత్రాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ చిత్రం బాగా కనెక్ట్ అయ్యింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.
మరల 19 ఏళ్ళ తర్వాత సెల్వ రాఘవన్ 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో కూడా రవికృష్ణనే హీరోగా నటించబోతున్నాడంట. ఈ యంగ్ హీరో మొదటి చిత్రం తర్వాత రెండు, మూడు తెలుగు సినిమాలలో నటించాడు. కెరియర్ అంత సక్సెస్ ఫుల్ గా నడవకపోవడంతో సినిమాలకి విరామం ఇచ్చారు.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో అతని పాత్ర ఎలా ఉండబోతోందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ ని ఎంపిక చేశారు. చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అనశ్వర యారియన్ 2, రాంగి సినిమాలలో లీడ్ రోల్ చేసింది. సెల్వ రాఘవన్ చివరిగా గత ఏడాది ధనుష్ తో నేనే వరువేన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
Follow
Follow
Post a Comment