ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ హీరో తోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది.
వింటేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఫ్యాన్ ఇండియా అనే పదానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా దర్శకుడు అన్ని భాషల నుంచి కూడా నటీనటులను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి ఇద్దరు ప్రముఖ నటినటులను అలాగే తమిళంలో నుంచి విజయ్ సేతుపతిని ఇంకా మలయాళం నుంచి మరో ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందట. ఇక కన్నడ భాష నుంచి కూడా ఒక ప్రముఖ సీనియర్ నటుడు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ కు న్యాయం చేసే విధంగా దర్శకుడు సినిమాలో భారీ స్థాయిలో పైకి తీసుకు వస్తున్నట్లు సమాచారం. సినిమా మేకింగ్ కంటే నటీనటుల కోసం ఎక్కువ స్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లు టాక్.
Follow
Post a Comment