డబుల్ ఇస్మార్ట్.. 30 కోట్ల రెమ్యునరేషనా?


రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక యాక్షన్ ఎపిసోడ్ ను కూడా పూర్తి చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక అతనికి దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే హీరో రామ్ కు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా పలు రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. కానీ ఇది నమ్మడానికి ఎంత మాత్రం వీలు పడటం లేదు. ఎందుకంటే అసలే లైగర్ సినిమా కొట్టిన దెబ్బకు పూరి జగన్నాథ్ ఈ సినిమాతో నష్టాలను రికవరీ చేసుకోవాలి అని చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమాను తెలివిగా డిజైన్ చేసుకుంటున్నాడు. పూరి కనెక్ట్స్ లో ఈ సినిమాను చార్మితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇక రామ్ రేంజ్ ను చూసి 30 కోట్లు ఇస్తున్నారా అంటే అసలు ఇప్పటివరకు రామ్ సినిమాలు అసలు ఆ రేంజ్ లో ఇచ్చేంత హిట్ అయ్యాయా లేదా అనేది కూడా గమనించాలి. చివరి రెండు సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా ది వారియర్ సినిమా అయితే 17 కోట్ల నష్టాలను మిగిల్చింది. స్కంద ఏమైనా హిట్టయితే దాన్ని బట్టి అతని రెమ్యునరేషన్ పెరగచ్చు. కానీ డబుల్ ఇస్మార్ట్ కు మాత్రం 30 కోట్ల జీతం అనేది తప్పే అని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post