పుష్ప 2.. సుకుమార్ పైనే అసలు డౌట్!


పుష్ప 1 సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సెకండ్ పార్ట్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అని దర్శకుడు సుకుమార్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలైతే ఈ సీక్వెల్ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సింది. ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. అయితే పుష్ప 1 సాధించిన విజయంతో ఆ తర్వాత అంచనాలు మారిపోయాయి. 

కాబట్టి దర్శకుడు మళ్ళి పవర్ఫుల్ స్క్రిప్ట్ కోసం మొత్తం చేంజ్ చేశాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ షూటింగ్ స్పీడ్ గానే కొనసాగుతోంది. కానీ అనుకున్న కంటెంట్ మాత్రం 30% వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా 70 శాతం పూర్తి కావాలి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ చివరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఆలోచన ఒక విధంగా ఆదే అయినప్పటికీ కూడా అనుమానం అంతా కూడా సుకుమార్ పైనే ఉంది. 

ఎందుకంటే అతని పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప 2 విషయంలో మరింత కఠినంగా ఉంటున్నాడు. కాబట్టి ఏప్రిల్ నెలలో సినిమా వస్తుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. కేవలం 30 శాతం షూటింగ్ పూర్తి చేయడానికి ఏడెనిమిది నెలల సమయం తీసుకున్న సుకుమార్ మరో 70 శాతం పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటాడు అనేది డౌట్స్ క్రియేట్ చేస్తోంది. మరి సినిమా విడుదలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post