బ్లాక్‌బస్టర్ మూవీ "గదర్: ఏక్ ప్రేమ్ కథ" తరువాత దాదాపు 22 సంవత్సరాల అనంతరం సన్నీ డియోల్ అమీషా పటేల్ "గదర్ 2"తో
మరో బిగ్ సక్సెస్ చూశారు. విడుదలైన ఐదు రోజులలో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 228 కోట్లను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 543 కోట్ల కలెక్షన్లు సాధించిన షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ "పఠాన్" వసూళ్లను త్వరలో అధిగమించగలదా అని పలువురు అంచనా వేస్తున్నారు.
గదర్ 2 పఠాన్ కలెక్షన్స్ ను అధిగమించే అవకాశం దాదాపు 95 శాతం ఉందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరో నెల పాటు పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు రావడం లేదు. కాబట్టి సినిమాకు బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పోటీగా అక్షయ్ కుమార్ OMG 2 ఉన్నప్పటికీ అదేమీ గదర్ ను డామినేట్ చేసేలా కనిపించడం లేదు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన "గదర్ 2"లో ఉత్కర్ష్ శర్మ, మనీష్ వాధ్వా, గౌరవ్ చోప్రా వంటి వారు నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న అక్షయ్ కుమార్ "OMG 2"తో పాటు విడుదలైంది.
Follow
Post a Comment