చరణ్ నుంచి ప్రభాస్ వరకు.. 2 వేల కోట్లు?


2024 టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవ్వర్ బిఫోర్ అనేలా పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. స్టార్ హీరోలు చాలా ఎక్కువ టైం తీసుకొని చేస్తున్న సినిమాలకు బిజినెస్ కూడా గట్టిగానే జరగనుంది. ఇక ఒక్కో సినిమాకి యావరేజ్ గా 300 కోట్ల కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు. ఇక 2024 సమ్మర్ లో మూడు నెలల్లో 1700 నుంచి 2000 కోట్ల రేంజ్ లో అయితే మన టాలీవుడ్ స్టార్స్ బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక ముందుగా ఆ సినిమాల బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ముందుగా సమ్మర్ లో మార్చిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి 300 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఆ తరువాత ఏప్రిల్ లో దేవర రానున్నాడు. దానికి కూడా 270 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఇక పుష్ప సినిమా కూడా ఏప్రిల్ చివరలో రావచ్చు. ఆ సినిమాకు 350 కోట్ల బడ్జెట్ అయ్యే ఛాన్స్ ఉందట. ఇక మే నెలలో ప్రభాస్ కల్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ సినిమా బడ్జెట్ అయితే ఏకంగా 550 కోట్లు. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ లో వచ్చే ఏడాది 3 నెలల్లోనే మన స్టార్స్ 2000 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలు అనుకున్నట్లు హిట్ అవుతాయో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post