ఆగస్టు 15.. ఒక్క రోజులో 150 కోట్లు


ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం, చలనచిత్ర పరిశ్రమకు మంచి లాభాలు తీసుకొచ్చింది. మరోసారి దేశవ్యాప్తంగా థియేటర్లకు భారీ స్థాయిలో ప్రేక్షకులను తీసుకు రాగలిగిన సినిమాలకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. రజనీకాంత్ "జైలర్" సౌత్ బాక్సాఫీస్ వద్ద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. అయితే "గదర్ 2" "OMG 2" మొత్తం భారతీయ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లు సాధించాయి.

ఆగస్టు 15వ తేదీన మాత్రమే ఈ మూడు సినిమాలు 150+ కోట్ల గ్రాస్‌ను సాధించాయి. గదర్ 2 అయితే మాస్ ఏరియాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో చాలా సందడి చేస్తోంది. ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఇక జైలర్ నిన్నటి కలెక్షన్స్ తోనే 400 కోట్లను దాటేశాడు. "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ," "భోలా శంకర్," వంటి సినిమాలు అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు కానీ ఈ రికార్డులో మాత్రం వాటి పాత్రను పోషించాయి.

Post a Comment

Previous Post Next Post