రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో చేసిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదలవుతుండగా అంతకంటే ముందుగా విజయ్ దేవరకొండ ఖుషి సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండు సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేయాలి అని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇద్దరి గత సినిమాల వైఫల్యాలు అయితే నిర్మాతలకు గట్టిగా దెబ్బ కొట్టాయి.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ లైగర్ దాదాపు 50 కోట్ల రేంజ్ లో అయితే నష్టాలను కలిగించింది. ఇక రామ్ పోతినేని ది వారియర్ సినిమా దాదాపు 17 కోట్ల స్థాయిలో అయితే నష్టాలను మిగిల్చింది. పెట్టిన పెట్టుబడులకు మాత్రం ఇవి చాలా అతిపెద్ద నష్టాలు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఖుషి సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 60 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇక స్కంద సినిమాపై శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ కూడా అదే తరహాలో 60 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇద్దరు హీరోలపై ఇప్పుడు సెప్టెంబర్ నెలలో 120 కోట్ల రిస్క్ అయితే జరుగుతోంది. మరి ఈసారైనా ఈ స్టార్ హీరోలు సక్సెస్ అందుకుని నిర్మాతలకు ప్రాఫిట్స్ ఇస్తారో లేదో చూడాలి.
Follow
Post a Comment