మెహర్ రమేష్ మొదట్లో రైటర్ గా దేశముదురు పోకిరి ఇలాంటి సినిమాల్లో తన పెన్ పవర్ ను చూపించాడు. ఆ తర్వాత ఆంధ్రవాలా, ఒక్కడు లాంటి సినిమాలను కన్నడలో రీమేక్ చేసి సక్సెస్ కొట్టాడు. ఇక తెలుగులో అతని మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కంత్రి. ఆ తర్వాత ప్రభాస్ తో బిల్లా అనే సినిమా చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా నష్టాలను ఏమి తీసుకురాలేదు.
కానీ ఆ తర్వాత మెహర్ రమేష్ చేసిన సినిమాలు మాత్రం దారుణంగా దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అతన్ని నమ్మే శక్తి సినిమాతో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా దాదాపు 45 నుంచి 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా దాదాపు 30 కోట్లకు పైగా పోగొట్టింది. ఇక షాడో సినిమాను వెంకటేష్ మార్కెట్ కు మించి 30 కోట్లకు ఖర్చుపెట్టి నిర్మించారు. దీంతో ఆ సినిమా కు కేవలం 10 కోట్లు వచ్చాయి. దాదాపు 20 కోట్ల షాడో సినిమా నష్టాలు కలిగించింది.
ఇక ఇప్పుడు భోళా శంకర్ సినిమాను దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తోనే నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా దాదాపు 50 కోట్ల రేంజ్ లోనే నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తంగా చూసుకుంటే మెహర్ రమేష్ ఇప్పటివరకు తన చివరి మూడు సినిమాలతో 100 కోట్ల వరకు పోగొట్టేశాడు అని చెప్పవచ్చు.
Follow
Follow
Post a Comment