రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో త్వరలోనే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు జటాయు అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నారు. విజువల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే పరుశురాంతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు ఫ్యామిలీ మెన్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఇక మోహన్ కృష్ణ ఇంద్రగంటి గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన 'V' సినిమాతో పాటు చివరగా వర్క్ చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ దిల్ రాజు దర్శకుడిపై కాస్త నమ్మకంతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయ్ తో చేయబోయే ప్రాజెక్టును దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్లోనే నిర్మించే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారికంగా కూడా క్లారిటీ రానున్నట్లు సమాచారం.
Follow
Post a Comment