రామ్ చరణ్ తేజ్ 16వ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో బిగ్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు తన తదుపరి సినిమాను అగ్ర హీరోతోనే చేయాలి అని మొండిగా ఫిక్స్ అయ్యాడు. చిన్న హీరోల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా అతను టెంప్ట్ అవలేదు. ఇక మొత్తానికి అతను రామ్ చరణ్ తో చేయబోయి సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్టును ఆగస్టు లో లాంచ్ చేసి ఈ ఏడాది డిసెంబర్ లేదా 2024 జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అప్పటివరకు కొన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసుకోబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ ను అయితే ప్రస్తుతానికి ఫిక్స్ చేయలేదు. కానీ దీపిక పడుకొనే అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి బుచ్చిబాబు అయితే ఒక టీమ్ సెట్ చేసుకున్నాడు. ఇక ఇదే నెలలో మరోసారి రాంచరణ్ తో కలిసి లాంచ్ కు సంబంధించిన విషయాల గురించి చర్చించబోతున్నాడు. ఇక సినిమాను 2025 లోనే విడుదల చేసే అవకాశం ఉంది.
Follow
Post a Comment