పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలో యాక్షన్ ప్రియులకు మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలలో ఆడియెన్స్ తప్పకుండా హై లెవెల్ యాక్షన్ సీన్స్ అయితే ఇష్టపడతారు.
అయితే బ్రో కథ మాత్రం అలాంటిది కాదు. అయినప్పటికీ కూడా ఇందులో ఫ్యాన్స్ కోసమైతే ఒక ఫైట్ ఉంటుందట. అది కూడా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరి కాంబినేషన్స్ లో ఆ ఫైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ ఆ ఫైట్ గురించి ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు.
ఇది ఎక్కువగా ఎమోషన్స్ పై నడిచే కథ.. అందుకే కథ ప్రకారం ఎక్కువగా యాక్షన్ డోస్ అయితే పెట్టలేదట. కాకపోతే వచ్చే ఒక ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ లు అయితే ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాయి అని సాయి ధరంతేజ్ వివరణ ఇచ్చాడు. మరి ఈ ఫైట్ విషయంలో ఫ్యాన్స్ ఇంతవరకు సంతృప్తి చెందుతారో చూడాలి. ఇక పవన్ రోల్ ఈ సినిమాలో మొదట 20 నిమిషాలు తప్పితే మిగతా టైమ్ లో మొత్తం ఉంటుందని కూడా సాయి తెలియజేశాడు.
Follow
Follow
Post a Comment