త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట రైటర్ గానే తన సినిమా కెరీర్ ను ప్రారంభించాడు. దర్శకుడిగా మారిన తర్వాత ఎంతో నచ్చితే గాని రైటర్ గా మళ్ళీ ఆయన పని చేయడం లేదు. ఇక ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం ఆయన మరొక దర్శకుడి కింద రైటర్ గా వర్క్ చేశారు. బ్రో సినిమాకు సముద్రఖని దర్శకుడు అనే మాటే గాని దాదాపు అన్ని పనులు కూడా త్రివిక్రమ్ దగ్గర ఉండే చూసుకున్నాడు.
అయితే ఈ సినిమాకు రైటర్ గా అలాగే స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ రెమ్యునరేషన్ దర్శకుడు సముద్రఖని కంటే ఎక్కువ అని తెలుస్తోంది. దాదాపు ఆయన 20 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది కేవలం వర్క్ చేసినందుకే కాదు త్రివిక్రమ్ సినిమా నిర్మాణంలో పీపుల్స్ మీడియా వాళ్లతో భాగస్వామిగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా బిజినెస్ బట్టి ఆయన 20 కోట్లు తీసుకొని పక్కకు జరిగారట. ఇక మిగతా బిజినెస్ డీల్స్ అన్నీ కూడా పీపుల్స్ మీడియా వాళ్ళు మాట్లాడుకుని మంచి ఆదాయాన్ని అయితే అందుకున్నారు.
Follow
Post a Comment