కథ:
మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) కుటుంబాన్ని పోషించేవాడు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన మార్క్ తన సోదరుడు, ఇద్దరు సోదరీమణులను పెంచుతాడు. ఇక ప్రతీ విషయానికి టైమ్ లేదు అని చెప్పే అతను కాలంతో పోటీ పడుతూ ఉంటాడు. ఇక ఒక ప్రమాదం తరువాత కథలో ఫాంటసీ మలుపు తిరుగుతుంది. అప్పటి నుండి TIME పాత్ర (పవన్ కళ్యాణ్ పోషించినది) సపోర్ట్ ఇస్తుంది. ఇక మార్క్ తన జీవితానికి 90-రోజుల పొడిగింపును పొందాడు. 90-రోజుల గ్రేస్ పీరియడ్‌లో ఏమి జరుగుతుంది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
BRO సినిమా తమిళ మూవీ 'వినోదయ సితం' రీమేక్ అని తెలిసిందే. ఒరిజినల్‌ను హ్యాండిల్ చేసిన అదే దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం ‘BRO’.
కమర్షియల్ కోణంలో సినిమాను మెరుగుపరచడానికి, తెలుగు వెర్షన్ టీమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆకర్షణీయమైన గతంపై ఎక్కువగా ఫోకస్ చేసింది. పవన్ వింటేజ్ స్టైల్ ను గట్టిగానే ఫాలో అయ్యారు. అలాగే పవన్ గత సినిమాలకు సంబంధించిన పాయింట్స్ ను కూడా బాగానే హైలెట్ చేశారు.
రైటింగ్ టీమ్ అన్ని పవన్ కళ్యాణ్ హిట్ పాటలను మిక్స్ చేశారు. అది కూడా సినిమాలో టైమ్ కు తగ్గట్టుగానే కథలో మిక్స్ చేసిన విధానం బాగుంది. కేవలం అక్కడక్కడా మాత్రం ఇరికించారు అన్నట్లు ఉంటుంది. ఇక సినిమాలో పలు అంశాలు ఉహించదగినవి గానే ఉంటాయి కానీ ఎమోషన్స్ ను బాగానే హ్యాండిల్ చేశారు. ఇక అక్కడక్కడా త్రివిక్రమ్ మార్క్ టైమింగ్ కామెడీ ఉంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ లోనే మంచి డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్ లో ఇతివృత్తం వర్క్ అవుట్ అయి వినోదాత్మకంగా కనిపించింది. టైమ్ గా పవన్ కళ్యాణ్ రకరకాల పాత్రల్లో కనిపించి అభిమానులను అలరిస్తారు. అతని కాస్ట్యూమ్స్ మరియు హిస్ట్రియానిక్స్ అతని టాప్ క్లాస్ స్టైల్ ఉన్నాయి. పొలిటికల్ ఫ్లేవర్ డైలాగులు ఎక్కడా లేకుండా హుషారుగా పొందుపరిచారు. కానీ జనసేన గాజు గ్లాసు అక్కడక్కడా బాగానే హైలెట్ అయ్యింది.
ప్రధాన కథ తాత్విక స్వభావాన్ని కలిగి ఉంది, క్లైమాక్స్ ఆధునిక రోజుల జీవిత సారాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు సముద్రఖని. అయితే, ఈ చిత్రం యొక్క సారాంశం పవన్ అభిమానులను ఆకర్షించడానికి జోడించిన అంశాలతో మిక్స్ చేసి ఉంది. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న పాటలు డీసెంట్‌గా ఉన్నాయి. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్. మ్యూజిక్ తో అదరగొట్టేసాడు. 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' నిర్మాణ విలువలు సరిపోతాయి. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా బాగుంది.
పవన్ కళ్యాణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సినిమాను కాపాడాడు. సాయిధరమ్ తేజ్ కూడా డీసెంట్ గా నటించాడు. బ్రహ్మానందం ఒక సీన్‌లో కనిపిస్తాడు, అది చాలా బాగుంది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి పాత్రలు చాలా పరిమితమైనవి. ప్రధానంగా సినిమా మొత్తం పవన్, సాయి ధరమ్ తేజ్ మధ్య సాగుతుంది. మొత్తానికి బ్రో సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా కొనసాగగా.. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్స్ తో క్లిక్ అయ్యింది. ఫ్యాన్స్ కు పవన్ పాత్ర గట్టిగానే ఎక్కేస్తుంది. పవర్ స్టార్ స్టైల్ అలాగే ఎనర్జీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సెట్టయ్యాయి. ఎక్కడ ఆ హై వోల్టేజ్ పవర్ తగ్గలేదు. దానికి తోడు త్రివిక్రమ్ డైలాగ్స్ ఇంకా ఆకట్టుకున్నాయి. టైమ్ గాడ్ గా పవన్ కనిపించిన విధానం పర్ఫెక్ట్ బాడీ లాగ్వేజ్ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చాయి. ఇక మిగతా సినీ లవర్స్ కు కూడా మంచి మెస్సేజ్ తో పాటు బ్రో మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
👉పవన్ కళ్యాణ్
👉త్రివిక్రమ్ డైలాగ్స్
👉థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
👉ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్: 3/5
Follow
సినిమా చాలా బాగుంది చచ్చిపోయిన తరువాత, భవిష్యత్ గురించి మనం పడే పాట్లు, బంధుత్వాలు వలన పడే ట్టెన్షన్ , జీవితం, అన్నీ యువతను ఆలోచింపచేస్తుంది.
ReplyDeletePost a Comment