మృణాల్ రెమ్యునరేషన్.. మళ్ళీ పెంచేస్తోంది?


మృణాల్ ఠాకూర్.. సీతారామం కంటే ముందు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. కానీ అమ్మడికి ఈ సినిమాతోనే మంచి క్రేజ్ దక్కింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా చాలా బిజీగా మారిపోతుంది. కేవలం ఇప్పుడు హిందీలోనే కాకుండా మరోవైపు తమిళంలో కూడా అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. 

ఈ క్రమంలో అమ్మడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటుంది. అంతేకాకుండా డిమాండ్ ఉన్నప్పుడే భారీ స్థాయిలో పారితోషికం అందుకోవాలి అని ఆలోచిస్తుంది. ఇక ఈ బ్యూటీ మొన్నటి వరకు ఒక కోటిన్నర వరకు డిమాండ్ చేసింది. ఇక ఇప్పుడు రెండు కోట్ల ను టచ్ చేసే విధంగా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆ మధ్య రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కొన్ని కథనాలు అయితే వచ్చాయి. కానీ ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం అమ్మడు నాని 30వ సినిమాతో బిజీగా ఉంది. ఇక తదుపరి సినిమాలకు మాత్రం రెండు కోట్ల వరకు తీసుకోవాలని డిసైడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అమ్మడు నెక్స్ట్ సినిమాతో ఇలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post