అయ్యో రంగబలి.. నిర్మాత మళ్ళీ బలి!


నిర్మాత సుధాకర్ చెరుకూరి దసరా ముందు వరకు కంటిన్యూ ఫ్లాప్‌లు చూశారు. అతని గత చిత్రాలైన పడి పడి లేచె మనసు, విరాట పర్వం, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ వంటివన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యాయి. కానీ చివరికి అతను నాని దసరాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా అతనికి మంచి బిజినెస్ అయితే జరిగింది.

దసరాతో పెద్ద విజయాన్ని చూసిన సుధాకర్‌కి మంచి రోజులు రానున్నాయని భావించారు. కానీ ఇప్పుడు అతని బ్యానర్‌లో నాగ శౌర్య కథానాయకుడిగా నటించిన రంగబాలితో మళ్లీ ఫ్లాప్ కావడంతో నష్టాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. రంగబలి గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుండి పేలవమైన స్పందనను పొందింది. నెగిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ దెబ్బతింది. సినిమా మొదటి రోజు కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. మొదటి వీకెండ్ లో కూడా మెరుగ్గా రాకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయింది. .
ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేకపోయింది. ఇక దాదాపు పెట్టిన పెట్టుబడికి 3 కోట్లకు పైనే నష్టాలు రానున్నాయి.

Post a Comment

Previous Post Next Post