గేమ్ ఛేంజర్.. హిట్ డైరెక్టర్ మాత్రమే ఎందుకు?


గేమ్ ఛేంజర్ సినిమా కోసం దర్శకుడు శంకర్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని సన్నివేశాలను హిట్ దర్శకుడితో షూట్ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ తన సినీ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ తరహాలో తన సినిమాకు మరొక దర్శకుడిని కెప్టెన్ గా చేసిన సందర్భాలు లేవు. ఒక విధంగా ఈ నిర్ణయం ఆయనది కాదు. నిర్మాత దిల్ రాజుది మాత్రమే.

శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా పనుల్లో చాలా బిజీగా ఉండడంతో శైలేష్ కొలనును అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే అతను మాత్రమే ఎందుకు శంకర్ శిష్యులలో ఎవరికైనా ఆ బాధ్యతలను అప్పగించవచ్చు కదా అనే సందేహం రాకుండా ఉండదు. కానీ దిల్ రాజు మాత్రం ఆ సన్నివేశాలను కేవలం శైలేష్ మాత్రమే కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలడు అనే నమ్మకంతో శంకర్ కు చెప్పడం జరిగింది.

ఆ సీన్స్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయట. ప్రతీ షాట్ చాలా క్లారిటీగా రావాల్సి ఉంటుందట. శంకర్ లేకపోవడం వలన మిగతా ఆర్టిస్టుల డేట్స్ కూడా అడ్జస్ట్ చేయడం కష్టమని తప్పక ఈ రిస్కు తీసుకోవాల్సి వస్తుందట. తప్పకుండా శైలేష్ శంకర్ మార్క్ కు తగ్గట్టుగానే ఆ సీన్స్ ను ప్రజెంట్ చేయగలడు అని నమ్ముతున్నారు. మరి ఈ తరహా మార్పుల వలన సినిమాపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసమైతే తప్పనిసరిగా శంకర్ అందుబాటులో ఉండబోతున్నాడు.

Post a Comment

Previous Post Next Post