రాజమౌళి రిటైర్మెంట్... టైం దగ్గర పడినట్లేనా?


దర్శకదీరుడు రాజమౌళి తన చివరి చిత్రంగా మహాభారతంను తెరపైకి తీసుకువస్తానని గతంలో చాలా సార్లు చెప్పాడు. అలాగే ఆయన తండ్రి ప్రముఖ రచయిత కె విజయేంద్ర ప్రసాద్ కూడా అదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే రీసెంట్ గా ఆయన మరోసారి స్పందిస్తూ RRR సీక్వెల్ ఉంటుంది అని అయితే అది రాజమౌళి మాత్రమే తెరపైకి తీసుకువస్తాడా లేదా అనే విషయాన్ని మాత్రం చెప్పలేనని అన్నారు.

అలాగే మహేష్ బాబు తర్వాత రాజమౌళి డ్రీం ప్రాజెక్టు ఉండవచ్చు అని ఒక హింట్ అయితే ఇచ్చారు. అంటే రాజమౌళి మహేష్ బాబు తర్వాత మహాభారతం సినిమాను ఒక సీరిస్ లాగా నాలుగు లేదా ఐదు భాగాలలో తెరపైకి తీసుకురావచ్చు. ఇంకా దానికి దాదాపు ఏడేళ్ల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అంటే రాబోయే పదేళ్ళ కాలంలో రాజమౌళి నుంచి కేవలం రెండు ప్రాజెక్ట్ లు మాత్రమే రావచ్చు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి జక్కన్న ఈ విషయంలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post