బ్రో హిట్టవ్వడం.. వీరికి చాలా అవసరం!


మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంచిన ప్రతీ చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పకుండా సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని అనిపిస్తోంది, ఇక ఈ సినిమా ఫలితంపై హీరియిన్స్ అయితే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. సాయి ధరమ్ తేజు కు జోడిగా కేతిక శర్మ నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. 

ఈ ఇద్దరు ఇప్పటివరకు సక్సెస్ అనేది చూడలేదు. ప్రియా ప్రకాష్ మలయాళం లోనే గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే అక్కడే ఆమెకు అతిపెద్ద డిజాస్టర్ ఎదురయ్యింది. ఇక తెలుగులో ఆమె చేసిన చెక్, ఇష్క్ అనే సినిమాలు కూడా క్లిక్ కాలేదు. ఇక కేతిక రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా అనే మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు బ్రో సినిమా ద్వారా సక్సెస్ అందుకోవాలి అని ఈ ఇద్దరు భామలు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post