ప్రభాస్ కల్కీ గ్లింప్స్.. ఇంత తక్కువ రెస్పాన్సా?


ప్రభాస్ కల్కీ 2898 ఫస్ట్ గ్లింప్స్ ను అమెరికాలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇక సినిమా విజువల్స్ అయితే ఒక వర్గం ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ప్రభాస్ చాలా రోజుల తర్వాత బాహుబలి తరహాలో లుక్ లో కనిపిస్తున్నాడు అనే పాజిటివ్ కామెంట్స్ కూడా అందుకుంటున్నాడు.

అయితే ఈ గ్లింప్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో క్రేజ్ అందుకోలేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే 24 గంటల్లో కేవలం 11 మిలియన్ల వ్యూవ్స్ మాత్రమే వచ్చాయి. 500 కోట్ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ అది కూడా బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్ దీపికా పదుకొనే ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్ట్ K కి అనుకున్నంత స్థాయిలో క్రేజీ రాలేదు. ఇక ఆ మధ్య వచ్చిన సలార్ టీజర్ మాత్రం 24 గంటల్లోనే ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూవ్స్ అందుకున్న విషయం తెలిసిందే.

యూట్యూబ్లో ఈరోజుల్లో ప్రభాస్ కు 24 గంటలో పాత రికార్డులోనూ బ్రేక్ చేయడం పెద్ద టాస్క్ ఏమి కాదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. అమెరికాలో దీన్ని ఉదయం.. అంటే మన దగ్గర రాత్రి రిలీజ్ అవ్వడం కూడా ఒక కారణం. అంతేకాకుండా గ్లింప్స్ లో మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే హైలెట్ సీన్స్ అయితే పెద్దగా కనిపించలేదని అంటున్నారు. అలాగే వైజయంతి మూవీస్ యూట్యూబ్ రెవిన్యూ కోసం ఏదో ఆశపడినట్లు యాడ్స్ కూడా జత చేసింది. కాబట్టి అక్కడే బలంగా వ్యూవ్స్ పై ఎఫెక్ట్ పడింది. ఏదేమైనా ఈ గ్లింప్స్ ఒక రోజులో కనీసం 25 మిలియన్స్ రాబట్టాల్సింది. మరి తదుపరి టీజర్ విషయంలో అయినా వీరు జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post