పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ బ్రో మొత్తానికి పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొత్తంగా 100 కోట్లకు పైగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇక దాదాపు అన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ క్లోజ్ అయ్యే దశకు వచ్చేసింది. ఇక నైజాం ఏరియాలో నిన్న మొన్నటి వరకు కూడా బాగానే చర్చలు జరిగాయి.
మొదట పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 37 కోట్ల వరకు కోట్ చేసింది. ఇక దిల్ రాజు అయితే 30 కోట్ల వరకు సెట్ అయితే చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఎక్కువగా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. అయితే ఈసారి మాత్రం బ్రో సినిమా విషయంలో ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఇక మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ 33 కోట్ల రేంజ్ లో ఈ సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.
Post a Comment