ఆదిపురుష్ హిందీ లెక్క.. సలార్ పై హోప్స్!


భారీ అంచనాలతో తెరపైకి వచ్చిన ఆదిపురుష్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా అనేక రకాల ట్రోల్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమా మిగతాభాషలో పెద్దగా ప్రభావం చూపలేదు కానీ హిందీలో మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సెంటిమెంట్ తో మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.

కాస్త డీసెంట్ టాక్ వచ్చినా కూడా ప్రభాస్ సినిమాలు హై రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తాయి అని ఆదిపురుష్ ద్వారా అర్థమైంది. ఇప్పటివరకు హిందీలో ఆదిపురుష్ సినిమా 140 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. బాహుబలి మొదటి పార్ట్ 115 కోట్లు అందుకోగా ఆ తర్వాత బాహుబలి సెకండ్ పార్ట్ 511 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక సాహో 150 కోట్ల వరకు అందుకోగా రాధే శ్యామ్ డిజాస్టర్ వలన కేవలం 20 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక రాబోయే సలార్ సినిమా మాత్రం కాస్త పాజిటివ్ టాక్ అందుకున్న కూడా పాత రికార్డులన్నీ కూడా బ్లాస్ట్ అవుతాయి అని అనిపిస్తుంది.

Post a Comment

Previous Post Next Post