దేవర తరువాతే పుష్ప 2.. ఎప్పుడంటే..?


జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 4న విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ మూవీతో పుష్ప 2 సినిమా పోటీపడే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొంత టాక్ అయితే కొనసాగుతోంది. అసలైతే పుష్ప సెకండ్ పార్ట్ ముందుగానే రావాలి కానీ షూటింగ్ ఆలస్యమవుతొంది. దీంతో సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

అయితే పుష్ప 2 సినిమా దేవరకంటే ముందు రావడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చిన రెండు మూడు వారాల తర్వాత పుష్ప సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందట. లేకపోతే జూన్ లో విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్ ఆలోచిస్తున్నాడు. షూటింగ్ అయితే స్పీడ్ గానే కొనసాగుతోంది. ఇటీవల ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసిన దర్శకుడు మళ్ళి కొంత పర్సనల్ ఫ్యామిలీ రీజన్స్ వలన గ్యాప్ అయితే ఇచ్చాడు. మొత్తానికి సమ్మర్ లో దేవర సినిమాతో పాటు పుష్ప సెకండ్ పార్ట్ కూడా మార్కెట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post