బేబీ కోసం అంత బడ్జెట్ పెట్టారా?


ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమాకు వీకెండ్ లో మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత SKN ఈ సినిమాపై భారీగానే పెట్టుబడి పెట్టినట్లుగా అర్థమవుతుంది. బేబీ సినిమా స్టార్ క్యాస్టింగ్ పెద్దగా లేకపోయినా మేకింగ్ విధానం అలాగే ప్రమోషన్స్ కోసం కూడా కాస్త ఎక్కువగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా కోసం మొదట నాలుగు కోట్ల రేంజ్ లో ఖర్చు చేసినట్లుగా టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా లేటెస్ట్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత దాదాపు 7 నుంచి 8 కోట్లు రేంజ్ లో బడ్జెట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 7 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ముందుగానే సినిమాకు నాన్ థియేట్రికల్ ద్వారా ఏడు కోట్ల వరకు వచ్చాయి. ఇక నిర్మాత దాదాపు సేఫ్ అయినట్లే. మొదటి రోజు కూడా మంచి షేర్ కలక్షన్స్ వచ్చాయి. ఇక వీకెండ్ మొత్తంలో కూడా వచ్చే కలెక్షన్స్ బోనస్ అని చెప్పాలి.

Post a Comment

Previous Post Next Post