బింబిసార సినిమా సక్సెస్ అయింది అంటే అందుకు కారణం అందరి కృషి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ దర్శకుడు వశిష్ట ఇద్దరు కూడా మంచి సక్సెస్ కోసం పాటుపడి మొత్తానికి అనుకున్నది సాధించారు. వశిష్ట కథ చెప్పినప్పుడు చాలామంది హీరోలు ఒప్పుకోలేదు. కానీ కళ్యాణ్ రామ్ అతన్ని నమ్మి నిర్మాతను కూడా తీసుకువచ్చి వారి స్థాయిలోనే ప్రొడ్యూస్ చేయించాడు. ఇక దర్శకుడు వశిష్ట కూడా హార్డ్ వర్క్ పెట్టి ఇప్పుడు అగ్ర హీరోల నుంచి పిలుపులు అందుకుంటున్నాడు.
అయితే ఇప్పుడు మాత్రం ఈ దర్శకుడు బింబిసార2 సినిమాను కళ్యాణ్ రామ్ తో చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. కళ్యాణ్ రామ్ కు జి ప్రొడక్షన్ నుంచి దాదాపు 100 కోట్ల ఆఫర్ వచ్చింది. సినిమాకి సంబంధించిన అన్ని రకాల హక్కులు బిజినెస్ డీల్స్ కూడా కదా సెట్ అవ్వకముందే ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ దర్శకుడు కళ్యాణ్ రామ్ తో మళ్ళీ ఆ సినిమా చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు.
అతను తన తదుపరి సినిమాను చిరంజీవి లేదా రజినీకాంత్ లాంటి అగ్ర హీరోలతో చేయాలని చూస్తున్నాడు అయితే కళ్యాణ్ రామ్ మాత్రం రెండవ సినిమా కూడా తన ప్రొడక్షన్ లోనే చేయాలి అని ముందుగానే ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు. ఒకవేళ అలా చేయకపోతే వశిష్ట ఎక్కడ సినిమా చేసినా కూడా అందులో 40% రెమ్యునరేషన్ కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ కు ఇవ్వాల్సి ఉంటుంది . ఆ విధంగా కండిషన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో కాలమే సమాధానం చెప్పాలి.
Follow
Follow
Post a Comment