మాస్ మహారాజ రవితేజ టైమ్ గట్టిగానే నడుస్తుంది. క్రాక్ తర్వాత కూడా వరుస పరాజయాలు వచ్చినా కూడా గట్టిగానే నిలదదొక్కుకున్నాడు. ధమాకా సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పుడు మాస్ రాజకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఆ సినిమాల ద్వారా రవితేజ 120 కోట్లకు పైగానే ఆదాయాన్ని అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు 20 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాల లిస్టులోకి వెళితే హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ఇక గోపీచంద్ మైత్రి మూవీ మేకర్స్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సీతారా ఎంటర్టైన్మెంట్ దిల్ రాజు ప్రొడక్షన్స్ కూడా ఎదురుచూస్తున్నాయి. కలర్ ఫోటో సందీప్ రాజ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి ఒప్పేసుకున్నాడు. ఇక అభిషేక్ నామ ప్రొడక్షన్ లో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ లెక్కన ఓకే అయిన ఈ ఆరు సినిమాల ఆదాయం బట్టి రవితేజ తక్కువ కాలంలోనే 120 కోట్ల పైగానే రెమ్యునరేషన్ ద్వారా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Follow
Post a Comment