ప్రాజెక్ట్ K.. అసలు అప్డేట్ అప్పుడేనా?


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది అని ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. కానీ పరిస్థితి చూస్తుంటే సినిమా ఆ సమయానికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదు. ఇంకా టైటిల్ ఏమిటి అనేది కూడా చెప్పలేదు. పైగా పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు. 

ఈపాటికి సినిమా టైటిల్ తో పాటు ప్రభాస్ లుక్ అలాగే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టుల లుక్స్ కూడా విడుదల చేయాల్సింది. కానీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ప్రాజెక్ట్ K ఇంకా దూకుడుగా కనిపించడం లేదు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ పై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. జూలై రెండవ వారం లేదా మూడో వారంలో ఒక మోషన్ పోస్టర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో కూడా అధికారికంగా ఒక చిన్న అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post