మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఏ క్షణాన బీజం పడిందో గాని అప్పటినుంచి కూడా వీరి సినిమా పనులు సవ్యంగా సాగడం లేదు. కథ చర్చల నుంచి సినిమా షెడ్యూల్స్ వరకు కూడా ప్రతి విషయంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అసలు కథ ఓకే చేసినప్పుడే మహేష్ బాబు మళ్ళీ కొన్ని సన్నివేశాలలో మార్పులు కావాలి అంటూ అలాగే బౌన్డెడ్ స్క్రిప్ట్ కావాలి అంటూ అనేక రకాల కండిషన్స్ అయితే పెట్టాడు.
దీంతో త్రివిక్రమ్ చాలా టైం తీసుకున్నాడు. ఇక మొత్తానికి షూటింగ్ అయిన చకచకా ఫినిష్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ అయితే కొనసాగుతోంది కానీ ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా ఎడిటింగ్ రూమ్ వరకు వెళ్ళలేదు. అప్పట్లో రామ్ లక్ష్మణ్ మాస్టర్ తో కలిసి కోటి రూపాయల ఖర్చుతో సెట్ వేసి మరి ఒక యాక్షన్ సీన్ తో షూటింగ్ స్టార్ట్ చేశారు.
దానికి మొత్తంగా 4 నుంచి ఐదు కోట్ల రేంజ్ లో ఖర్చు చేశారు. అది కూడా వృధా అయిపోయింది. ఇక మళ్ళీ ఫ్రెష్ గా కొత్త కథ అంటూ మొదలు పెట్టినప్పటికీ దాన్ని కూడా క్యాన్సల్ చేశారు. 20 శాతం షూటింగ్ చేయగా దాని కోసం కూడా 10 నుంచి 12 కోట్ల మధ్యలో ఖర్చ చేశారు. ఇక ఎటు చూసుకున్నా కూడా ఇప్పటివరకు మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ హారిక హాసిని టీమ్ 15 కోట్ల రేంజ్ లో అయితే వృధా చేసినట్లుగా తెలుస్తోంది.
Follow
Post a Comment