పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ సలార్ పై ఇప్పుడు మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఆదిపురుష్ సినిమా అంతగా అంచనాలను అందుకోలేకపోవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా కొడితే ఈ సినిమాతోనే ప్రభాస్ గట్టిగా కొట్టాలి అనే ఎదురు చూస్తున్నారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ను నెవర్ బిఫోర్ అనేలా హై వోల్టేజ్ క్యారెక్టర్ తో ప్రెసెంట్ చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక కీలక అంశం ఇప్పుడు వైరల్ అవుతొంది. ఈ సినిమాలో అసలు పాయింట్ ఫ్రెండ్షిప్ చుట్టే తిరుగుతుందట. ప్రభాస్ క్యారెక్టర్ స్నేహం కోసం ఎంతవరకు అయినా వెళ్లే స్వభావంతో ఉంటుందట. కేజిఎఫ్ సినిమాలో తల్లి ఎమోషన్ ను ఎలాగైతే ఎలివేట్ చేశాడో ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ను కూడా దర్శకుడు ఇందులో మరింత ఎక్కువగా హైలెట్ చేస్తాడని తెలుస్తోంది. ఇక జూలై 9వ తేదీన సలార్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకంటుందో చూడాలి.
Follow
Post a Comment