ప్రభాస్ తో లోకేష్ కనగరాజు సినిమా చేయబోతున్నట్లుగా గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి. లియో సినిమాతో చాలా బిజీగా ఉన్న లోకేష్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ కు కూడా కథ చెప్పాను అని అతనితో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పినట్లుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక లియో సినిమా తర్వాత కూడా అది ఉంటుంది అని వార్తలు బాగానే వస్తున్నాయి.
కానీ ఇది నిజమా కాదా అని ఆరా తీస్తే మాత్రం అసలు నిజం కాదు అని తెలుస్తోంది. లోకేష్ తన యూనివర్స్ కథలతోనే కెరీర్ ముగుస్తుంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చిన మాట వాస్తవమే. గతంలో తెలుగు ఇండస్ట్రీలో అతను రామ్ చరణ్ కు కూడా ఒక కథ చెప్పాను అని అన్నాడు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ కు కథ చెప్పినట్లుగా ఎక్కడ లోకేష్ వివరణ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం అతని ఫోకస్ లియో సినిమా పైనే ఎక్కువగా ఉంది. ఇక రజనీకాంత్ తో కూడా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అతను గతంలో వివరణ ఇచ్చాడు. ఇక ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
Follow
Post a Comment