పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల కాలంలో వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ రాబోయే రోజుల్లో కొత్త ప్రొడక్షన్ హౌస్ లకు కూడా సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. మంచి కంటెంట్ తో వచ్చి తనకు కనెక్ట్ అయితే అడ్వాన్స్ తీసుకొని సంతకం పెట్టడానికి డార్లింగ్ రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రభాస్ లైనప్ పెద్దగా ఉంది.
అయితే గత రెండేళ్లుగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన KVN ప్రొడక్షన్స్ ప్రభాస్ డేట్స్ కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తోంది. అసలైతే సలార్ హోంబలే ఫిలిమ్స్ కంటే ముందుగానే ఈ సంస్థ ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకుంది. కానీ ప్రభాస్ వాళ్లకు మాట అయితే ఇచ్చాడు కానీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా వాళ్ళ ఎదురుచూపులకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి ప్రభాస్ ఓకే చెప్పాడు కానీ కథ విషయంలో మాత్రమే ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. ఇప్పటికే రెండు కథలు చెప్పించినప్పటికీ కూడా ప్రభాస్ దీనిపై పెద్దగా ఆసక్తిని చూపించలేదు. మరొక కన్నడ దర్శకుడు చెప్పిన ఒక పాయింట్ మాత్రం ప్రభాస్ కు నచ్చిందట. అయితే ఆ కథ స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో రెడీ అయితే ప్రభాస్ తో సినిమా మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ కాంబినేషన్పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.
Follow
Follow
Post a Comment