ఆదిపురుష్ 2.. ప్రభాస్ ఏమన్నాడంటే..


బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ సినిమా దారుణంగా డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు 60 కోట్ల రేంజ్ లోనే నష్టాలు కలిగించే అవకాశం అయితే ఉంది. ఇక రామాయణం కథను తెరపైకి తీసుకురావాలి అనుకున్నప్పుడు దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ను చాలా సార్లు బ్రతిమాలాల్సి వచ్చిందట.

ప్రభాస్ రిస్క్ చేయడం అవసరమా అని అనుకున్నాడు. ఇక డైరెక్టర్ కాస్త కాన్ఫిడెంట్గా కనిపించడంతో ఓకే చేశాడు. కానీ సినిమా మాత్రం అంచనాలకు తగ్గట్టుగా మాత్రం వెండితెర పైకి రాలేకపోయింది. అసలైతే మొదట ఈ కథ రాసుకున్న తర్వాత సెకండ్ పార్ట్ కూడా చేయాలని అనుకున్నారట. కానీ ప్రభాస్ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకమైన ఘట్టాలను ఒకసారి చూపిస్తే సరిపోతుంది అని మళ్ళీ సెకండ్ పార్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నాడుట. ఏదేమైనా ముందు జాగ్రత్తగా ప్రభాస్ చెప్పడం వల్లే చాలా బడ్జెట్ సేవ అయ్యింది. లేదంటే ఎంతో కొంత ఖర్చుతో సెకండ్ పార్ట్ సీన్స్ కొన్ని ముందే స్టార్ట్ చేసి ఉండేవారట.

Post a Comment

Previous Post Next Post