పండగ సీజన్ ను టార్గెట్ చేస్తే ఎలాగైనా అనుకున్న సమయానికి రావాలి అని స్టార్ హీరోలు చాలా వేగంగా షూటింగ్స్ ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతిని ఫిక్స్ చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయరు. కానీ ఈసారి మహేష్ బాబు మాత్రం సంక్రాంతికి వచ్చేలా కనిపించడం లేదు. అలాగే రామ్ చరణ్ కూడా ఊహించిన విధంగా సమ్మర్ కు షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ముందుగా గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతికి రావాలని అనుకుంది. కానీ ఇప్పుడు షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ ఉండడంతో ఏప్రిల్ మే నెలలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ తేజ్ గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఇక దర్శకుడు శంకర్ తన ఇండియన్ 2 సినిమాను సంక్రాంతికి తీసుకువచ్చి గేమ్ చెంజర్ సినిమాను 2024 మార్చి లేదా మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక ముందుగా రావాల్సి ఉన్న ప్రాజెక్టు కే విషయంలో కూడా కాస్త కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ సినిమా కూడా సంక్రాంతికి రావాలి కానీ పనులు అయితే ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయి. మరి అశ్విని దత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Follow
Post a Comment