ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలోనే కలెక్షన్స్ అందుకుంటుంది అని మొదటివారం ఓపెనింగ్స్ తో కొంత నమ్మకాన్ని కలిగించింది. కానీ సోమవారం నుంచి సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. పరిస్థితి చూస్తూ ఉంటే ఇక మళ్ళీ కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదని అర్థమవుతుంది. ఈ సినిమా మొత్తం ఐదు రోజుల్లో అయితే మొత్తంగా 164 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అయితే అందుకుంది. సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద టోటల్ గా 250 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది.
సినిమా నష్టపోకుండా ఉండాలి అంటే ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద టోటల్ గా 75 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకోవాలల్సి ఉంది. కానీ పరిస్థితి మాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. అటు ఇటుగా ఈ సినిమా 55 కోట్లకు పైగా నష్టాలు కలిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ కూడా ముగిసి పోయాయి కాబట్టి ఇక బయ్యర్లకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రభాస్ మాట మీద నమ్మకంతో తెలుగు స్టేట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు. మరి ప్రభాస్ వారికి సెటిల్మెంట్ ఏదైనా చేస్తాడో లేదో.
Follow
Mi istam vachinattu rates pedite evadu chustadu ra ayya
ReplyDeletePost a Comment