SSMB 28: ఇలా ఆలోచిస్తే మరో అజ్ఞాతవాసే!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా ఒకప్పుడు వాటి స్థాయి వేరుగా ఉండేవి. ఆయన డైలాగ్స్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మేకింగ్ విధానం మరో లెవెల్ అనేలా ఉండేవి. త్రివిక్రమ్ సినిమాలు ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా అయినప్పటికీ వాటికి వచ్చే రెస్పాన్స్ KGF తరహాలో ఉండేది. అయితే గత కొంతకాలంగా అనంతరం గురూజీ మార్క్ మిస్సవుతోంది అనే కామెంట్స్ వస్తున్నాయి. 

ముఖ్యంగా అజ్ఞాతవాసితో కొట్టిన దెబ్బకు తరువాత సినిమాలకు కమర్షియల్ లెక్కలు వేసుకొని తెరపైకి తీసుకు వచ్చారు. అల.. వైకుంఠపురములో సక్సెస్ అయినా కూడా పెదవి విరిచే వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు SSMB28 విషయంలో త్రివిక్రమ్ ఆలోచించే విధానం సినిమా స్థాయిని తగ్గిస్తోంది. ముఖ్యంగా టైటిల్స్ పెట్టె విషయంలో వస్తున్న లీక్స్ కూడా షాక్ ఇస్తున్నాయి. 

అయోధ్యలో అర్జునుడు’, ‘అమ్మ కథ’, ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’, పల్నాటి పోటుగాడు అనే టైటిల్స్ లో ఎదో ఒకటి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయోధ్యలో అర్జునుడు తప్ప మిగతావి ఫ్యాన్స్ కు అసలు నచ్చడం లేదు. అయినా అలాంటి టైటిల్స్ పెడితే మరో అజ్ఞాతవాసి అవ్వడం కాయమని అంటున్నారు. మహేష్ రేంజ్ కు సరిపోయే టైటిల్ సెట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post