రాజమౌళి - బాలీవుడ్ స్టార్.. నిజమెంత?


రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ చేసిన తరువాత బాలీవుడ్ స్టార్ హీరోతో చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ కొత్త టాక్ వైరల్ అవుతోంది. ఇక నిజమెంత అనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం అయితే రాజమౌళి మహేష్ తో తప్పితే.. ఆ తరువాత ఏం చేయాలి అనే దాని గురించి అసలు ఆలోచించడం లేదు. బాలీవుడ్ స్టార్స్ సిద్ధంగా ఉన్నా కూడా రాజమౌళి మాత్రం టాలీవుడ్ స్టార్స్ తోనే బిగ్ మూవీస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. 

అవసరం అయితే గెస్ట్ రోల్స్ కు వాడుకోవచ్చు. కానీ ఇప్పట్లో మాత్రం ఆయన బాలీవుడ్ స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం కనిపించడం లేదు. ఇక మహాభారతం తీసినప్పుడు మాత్రం జక్కన్న తప్పకుండా బాలీవుడ్ అనే కాకుండా ఇతర లాంగ్వేజ్ లోని స్టార్స్ ను కూడా రంగంలోకి దింపే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తి స్థాయిలో బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన అనంతరం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది సమ్మర్ నుంచి స్టార్ట్ కానుంది.

Post a Comment

Previous Post Next Post