కథ:
విశ్లేషణ:
నిజాయితీగా ఉండే యువ కానిస్టేబుల్ శివ (నాగ చైతన్య) మాఫియాకు చెందిన రాజు (అరవింద్ స్వామి)ని ఎలాగైనా కస్టడీలోకి తీసుకోవాలి అని అనుకుంటాడు. ఇక మరోవైపు రాజుపై మరికొందరు ఫోకస్ చేస్తారు. ఈ కథ శివ, సిబిఐ ఆఫీసర్ (సంపత్), హిట్‌మాన్ రాజు (అరవింద్ స్వామి) మరో పోలీస్ ఆఫీసర్ (ఆర్. శరత్ కుమార్) మధ్య తిరుగుతుంది. CBI అలాగే మాఫియా మధ్య ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న తరువాత కానిస్టేబుల్ శివ వారిని అనుసరించవలసి వస్తుంది. ఈ కేసులో ఉండగా
శివకు రేవతి మధ్య ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. ఇక ఆ తరువాత నాగచైతన్య ఒక నిర్దోషిని ఎలా కస్టడిలో తీసుకున్నాడు. అసలు ఎదురైన సవాళ్లు ఏంటి? మిస్టర్ రాజును రెండు టీమ్‌లు ఎలా, ఎందుకు వెంబడిస్తున్నారనేదే మిగతా కథ.
విశ్లేషణ:
పలు డీసెంట్ చిత్రాలను అందించిన దర్శకుడు వెంకట్ ప్రభు కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 1996 నేపథ్యంలో సాగే ఈ చిత్రం రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో తెరకెక్కింది. బాంబు పేలుడులో 40 మంది మరణించిన తరువాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక కానిస్టేబుల్ శివ పరిచయం, రేవతి (కృతి శెట్టి)తో అతని ప్రేమ ఎపిసోడ్‌లు కథకు అవసరమే అయినా ఇలాంటి రొటిన్స్ సీన్స్ ఓల్డ్ గా అనిపిస్తాయి. ఆ లవ్ ట్రాక్ కు ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు.
ఇక వెన్నెల కిషోర్ కామెడీ ఏ మాత్రం పేలలేదు. రాజు (అరవింద స్వామి), సిబిఐ ఆఫీసర్ శరత్ కుమార్ పాత్రలు ప్రవేశించిన తర్వాత, సినిమా కొంచెం వేగం పెరుగుతుంది. ఇక తక్కువ బడ్జెట్ ఛేజింగ్ ఎపిసోడ్‌లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. దర్శకుడు నేచురల్ గా తీయాలని అనుకున్నాడు కానీ అవి చాలా బోరింగ్ గా అనిపిస్తాయి.
అయితే ఓవరాల్‌గా, ఇంటర్వెల్ పార్ట్ సెకండాఫ్‌పై కొంత ఆశను కలిగిస్తుంది. ఇక సెకండాఫ్ శివ ఫ్యామిలీ బ్యాక్ స్టోరీతో మొదలవుతుంది. అనంతరం రాజును వెంబడించే పోలీసులతో సినిమా సాగుతుంది.
సాంకేతికంగా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా బలం లేదు, పాటలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ చిత్రానికి ప్రధాన లోపమేమిటంటే.. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వర్కవుట్ అయిన ఏకైక మంచి విషయం కాస్టింగ్. కానీ బలహీనమైన స్క్రిప్ట్‌తో అవుట్‌పుట్ దెబ్బతింది. అక్కడక్కడా ఈ స్టార్ క్యాస్ట్ వలన కొన్ని మెరుపులు ఉన్నాయి అంతే. మొత్తంగా చూస్తే మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ విలువలు పెద్దగా లేవు. ఒకానొక సమయంలో ఈ చిత్రం కొంతమంది తెలుగు నటీనటులతో తమిళ చిత్రంలా కనిపిస్తుంది.
దర్శకుడు వెంకట్ ప్రభు ద్విభాషా ప్రయత్నం వల్ల తన ఫ్లేవర్‌ని మిస్సయ్యాడు అనిపిస్తుంది. ఇక నటుడిగా నాగచైతన్య కాస్త కొత్తగా ట్రై చేసిన విధానం బాగుంది. కృతి శెట్టి పాత్ర పెద్దగా గుర్తుండిపోయేలా అనిపించదు. ఇక అరవింద్ స్వామి, ప్రియమణి, సంపత్, ఆర్.శరత్‌కుమార్ పరవాలేదు. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం అరవిందస్వామి గెటప్, క్యారెక్టరైజేషన్ చిరాకు తెప్పిస్తాయి. ఏదేమైనా కస్టడీ సినిమా ఆశించినంతగా కనెక్ట్ చేయలేకపోయింది.
ప్లస్ పాయింట్స్:
👉కొన్ని పాత్రలు
👉సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
👉రొటీన్ లవ్ ట్రాక్
👉చేసింగ్ సీక్వెన్స్
👉బోరింగ్ స్క్రీన్ ప్లే
రేటింగ్: 2/5
Follow
Post a Comment