విరూపాక్ష మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
1979లో గ్రామస్తులు చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో దంపతులను సజీవ దహనం చేయడంలో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అయితే మరణిస్తున్న దంపతులు వచ్చే పుష్కరం నాటికి గ్రామం మొత్తం చనిపోతారని శాపనార్థాలు పెడతారు. ఇక 1991కి అభివృద్ధి చెందిన గ్రామంలో జరుగుతున్న మరణాల పరంపరను ఎదుర్కోవడానికి, అష్ట దిగ్బంధనం అనే ఒక వల ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ రహస్య మరణాలు కొనసాగుతుంటాయి. అయితే ఆ కఠిన సమయంలో సూర్య (సాయి ధరమ్ తేజ్) మరణాలకు ఎవరు కారణమవుతున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు. అనంతరం ఆ గ్రామంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి చేతబడి శక్తులను అతను ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కారణం ఏంటి అనేది వెండితెరపై చూడాలి. 

విశ్లేషణ:
సాధారణంగా హారర్ జానర్ సినిమాలు ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి కొన్ని రెగ్యులర్ పాయింట్స్ తో కూడిన టెంప్లేట్ కథనాన్ని అనుసరిస్తాయి. కానీ విరూపాక్షలో ఆ తరహాలో కాకుండా కొత్త తరహా కథతో సినిమా కొనసాగుతుంది.  బ్యాక్‌డ్రాప్ ముందే తెలిసినప్పటికీ కథలో డెప్త్, స్క్రిప్ట్ పటిష్టంగా రాసుకోవడం వలన ఆసక్తిగా అనిపిస్తుంది. దానికి తోడు సౌండ్ డిజైన్ సినిమాటోగ్రఫీ తదితర సాంకేతిక అంశాలు బాగున్నాయి. సుకుమార్ శిష్యుడు యువ దర్శకుడు కార్తీక్ వర్మ దండు విశాలమైన కథతో చెప్పాల్సిన పాయింట్ ను బాగా హైలెట్ చేశాడు. అతనికి మిగతా సాంకేతిక బృందం బాగా మద్దతు ఇచ్చిందిని స్క్రీన్ పై అర్ధమవుతుంది. 

ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ మరియు వారి లవ్ ట్రాక్ చాలా రొటీన్ గా ఉంటాయి. సుక్కు అందించిన స్క్రీన్ ప్లే లో ఇలాంటి రొటీన్ సీన్స్ పెద్ద మైనస్ పాయింట్స్. ఇక తరువాత గ్రామస్తుల వరుస మరణాలు ఏడుపులు ఒక అరగంట పాటు విసుగు పుట్టిస్తాయి.  ఫస్ట్ హాఫ్‌ లో కథలోని కీలక అంశాలు బయటపడ్డాక, ఇంటర్వెల్ ముందు, సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది.  అప్పటి నుండి, విజువల్ ఎఫెక్ట్‌లతో కూడిన ట్విస్ట్‌లు  థ్రిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తాయి.  

ఇక తాంత్రిక శక్తులు అలాగే చేతబడి విజువల్స్ స్క్రీన్ చాలా కొత్తగా ఆసక్తిగా అనిపిస్తాయి.  హీరో సూర్య (సాయి ధరమ్ తేజ్) పాత్ర ఫస్ట్ హాఫ్‌లో అంత కీలకంగా అనిపించదు. ఇక సెకండ్‌ హాఫ్ లో మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో సాయి పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. నందిని (సంయుక్త మీనన్) క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా నిలుస్తుంది.  నందిని పాత్రలో సంయుక్త చాలా బాగా నటించింది. ఇక సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషించారు.  

సునీల్ క్యారెక్టరైజేషన్ బాగానే ఉన్నా ఏదో తక్కువైంది అన్నట్లు అనిపిస్తుంది.  అలాంటి పాత్రకు ఎవెరైనా సరిపోతారు అనిపిస్తుంది. ఇక కమల్ కామరాజు కీలక పాత్ర సినిమాకు బాగానే ప్లస్ అయ్యింది. ఇక టెక్నీకల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా హైలెట్ చేశారు. హారర్ సన్నివేశాల్లో లైటింగ్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇక అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ పాటలు పెద్దగా ఆకట్టుకోవు.  సాంకేతిక బృందంలో సౌండ్ డిజైన్ టీమ్ బెస్ట్ వర్క్ ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇక ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అద్భుతంగా ఉంది. మొత్తంగా విరూపాక్ష సినిమా హారర్ లవర్స్ కు పరవాలేదు అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ కమర్షియల్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 

ప్లస్ పాయింట్స్:
👉కథ బ్యాక్ డ్రాప్
👉సెకండ్ హాఫ్
👉విజువల్స్ ఎఫెక్ట్స్
👉క్లయిమాక్స్

మైనస్ పాయింట్స్:
👉రొటీన్ లవ్ సీన్స్
👉ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

రేటింగ్: 3.25/5

Post a Comment

Previous Post Next Post