కథ:
విశ్వామిత్రుడి తపస్సుకు భంగం కలిగించేలా చేసిన మేనక (మధుబాల) ఇంద్రుడు (జిషుసేన్ గుప్తా) ప్రణాళికలో భాగంగా ప్రేమలో పడి ఓ బిడ్డను కంటుంది. ఆ తరువత బిడ్డ పట్టడంతోనే అడివిలోనే వదిలేసి వెళ్తుంది. అయితే అనాధగా మారిన బిడ్డను కన్వ మహర్షి (సచిన్ ఖేడ్కర్) చేరదీసి శాకుంతల(సమంత) అని పేరు పెడుతాడు. అనంతరం కొన్నాళ్ళు గడిచిన తరువాత మహారాజు (దేవ్ మోహన్) శాకుంతల తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొంటారు. ఆ తరువాత మహారాజు రాజ్యానికి వెళ్లి నిన్ను పట్టపు రాణి చేసుకొంటానని మాట ఇస్తాడు. అప్పటికే శాకుంతల గర్బవతిగా ఉంటుంది. అప్పుడు ఆమె కన్వ మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. ఇక ఆ తరువాత ఏం జరిగింది? శాకుంతల ఎలాంటి శాపానికి గురవుతుంది? చివరికి ఆమె జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి అనే అంశాలను తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇంద్రుడి ప్రణాళిక వలన మేనక భూమిపైకి వచ్చి విశ్వామిత్రుడి తపస్పు భంగం కలిగించడంతో శాకుంతలం అసలు కథ మొదలవుతుంది. ఇక విశ్వామిత్రుడు, మేనక ప్రేమించుకోవడం వలన అనంతరం వారి శాకుంతల జన్మిస్తుంది. శాకుంతలం పాత్రను దర్శకుడు అందమైన ఒక కన్యగా చూపించిన విధానం స్క్రీన్ పై చాలా హైలెట్ అయ్యింది. మేనక ఎపిసోడ్‌ను అయితే ఎక్కువగా సాగదీయ లేదు. ఇక దుష్యంతుడి కథను కూడా దర్శకుడు ఆసక్తిగా ప్రజెంట్ చేశాడు.
కానీ కథలో లీనమయ్యే రేంజ్ లో అయితే ఫస్టాఫ్‌లో ఎమోషన్స్ క్లిక్ కాలేదు. చాలా ఫ్లాట్ గా కొనసాగుతున్న భావన కలుగుతుంది. ఆ విషయంలో కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. ఇక ప్రేక్షకులలో సెకండాఫ్‌లో సీన్స్ పై మాత్రం కొంత హైప్ పెంచే విధంగా కనిపిస్తుంది. విజువల్స్, వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగానే ఉన్నా కొన్ని సీన్స్ లో మాత్రం అనవసరం అనే విధంగా మరొక ఫీల్ ను కలిగిస్తాయి. దర్శకుడు ఎమోషన్ పై ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. ఇక 3డీ క్వాలిటీ అంతగా ఏమి మెప్పించదు.
సెకండాఫ్ లోకి వెళితే శకుంతలకు సంబంధించిన అసలు కధకు లీడ్ దొరుకుతుంది. ఇక ప్రకాశ్ రాజ్ చేసిన ఒక స్పెషల్ క్యారెక్టర్ సముద్ర ప్రయాణం కథలో మేయిన్ హైలెట్. దుష్కంతుడి సభలో భంగపాటుకు గురికావడంతో శాకుంతలం కథలో కొంత ట్విస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక ఆ డ్రామా అంతగా కనెక్ట్ అవ్వదు. ముఖ్యంగా కొన్ని సీరియస్ సీన్స్ విషయంలో దర్శకుడు ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది.
3డీలో అయితే చాలా లోపాలు తెరపైన కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఎడిటింగ్ లో కూడా అంతగా పనితనం కనిపించింది లేదు. సినిమా అల్లు అర్హ ఎంట్రీ కూడా బాగానే క్లిక్ అయ్యింది. ఈ చిన్నారి తన అద్భుతమైన డైలాగ్స్ కు హైలెట్ అయ్యేలా నటించింది. ఆ క్యారెక్టర్ మొదట పది నిమిషాలు వినోదంగా మారుతుంది. అనంతరం మళ్ళీ రొటీన్‌గా దుష్యంత్, శకుంతల పాత్రల మధ్య కథ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా సాగుతుంది.
సినిమా మొదటి నుంచి చివరి వరకు గుణశేఖర్ ప్రతీ సీన్ ను కూడా ఒక విజువల్ ట్రీట్ గా ఇవ్వాలని అలాగే మంచి డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు. కానీ కథ ముగింపు వరకు కూడా ఎమోషన్ అంతగా క్లిక్ కాలేదు. ఇక మణిశర్మ సంగీత పరంగా సాంగ్స్ అయితే అంతంత మాత్రంగానే ఉండగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగానే హైలెట్ అయ్యింది. ఫైనల్ గా సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా వెళితే కొంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్:
👉సమంత క్యారెక్టర్
👉సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్
👉గ్రాఫిక్స్
👉ఎమోషన్ కనెక్ట్ కాలేకపోవడం
👉ఫస్ట్ హాఫ్ బోరింగ్ సీన్స్
రేటింగ్: 2.25/5
Follow
Follow
Post a Comment