NBK108 అసలు కథ.. ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్!


నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ 60 ఏళ్ల పైబడిన ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇక ఆయనకు కూతురుగా శ్రీలీల నటిస్తున్నట్లు ముందుగానే క్లారిటీ కూడా ఇచ్చేశారు. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు వైరల్ అవుతుంది. సినిమా అసలు కథ ఒక ఫ్లాష్ బ్యాక్ చుట్టూ తిరుగుతుందట. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత మళ్లీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంది? అసలు బాలకృష్ణకు ఎందుకు శిక్ష పడింది? అతను ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్స్ అని టాక్. ఎమోషనల్ ట్రాక్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండే విధంగా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మొదటి సారి పూర్తిస్థాయిలో తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు.

Post a Comment

Previous Post Next Post