సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. #OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) ట్యాగ్ ను వర్కింగ్ టైటిల్ గా అనుకుంటుండగా చివరికి అదే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల నిర్మాత DVV దానయ్య ఆ టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. అలాగే సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకు రావాలని దానయ్య ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదివరకే వీరి బ్యానర్ లో RRR రావడం అలాగే ఇంతకుముందు దర్శకుడు సుజిత్ సాహో సినిమా ద్వారా పాన్ ఇండియా క్రేజ్ అందుకోవడంతో కొంత మార్కెట్ రూట్ ఉంది కాబట్టి ఆ ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ తన పోర్షన్ ను 60 రోజుల కంటే తక్కువ డేట్స్ లో ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Follow
Post a Comment