త్రివిక్రమ్ మల్టీస్టారర్.. మరో హీరో అతనే?


స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కంటే ముందు కొంతమంది హీరోలతో చర్చలు జరిపారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలోనే త్రివిక్రమ్ కొన్ని డిఫరెంట్ కథలు రెడీ చేసినట్లు టాక్. ఇక ఇటీవల హీరో నాని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక కథపై చర్చలు జరిపినట్లు క్లారిటీ అయితే ఇచ్చాడు. ముఖ్యంగా అది మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా నాని వివరణ ఇచ్చారు. 

ఆ విషయంలో పూర్తి స్థాయిలో నాని క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం అయితే వెంకటేష్ మరో హీరోగా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మరి నిజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి. ఇక నాని దసరా సినిమా మార్చి 30వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు వెంకీ, శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post