సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి తెరపైకి తీసుకు వస్తున్న చిత్రం ఏజెంట్. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంలో అనేక రకాల వార్తలు వచ్చాయి. 40 కోట్లతో అనుకున్న బడ్జెట్ లెక్కలు 70 కోట్లు దాటింది. దీంతో నిర్మాత చాలా అప్సెట్ అయినట్లు సమాచారం. అయితే బడ్జెట్ పెరిగినా కూడా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ సినిమా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.
ఇక "ఏజెంట్" ఏప్రిల్ 28న విడుదల కానుంది, అయితే ప్రమోషన్లు పేలవంగా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. అసలే పాన్ ఇండియా అన్నారు. అందుకే అఖిల్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి, సరైన ప్రమోషన్లతో సినిమా విడుదలను సరిగ్గా ప్లాన్ చేయాలని అఖిల్ అక్కినేని అభిమానులు అనిల్ సుంకరపై ఒత్తిడి తెస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాపై ఎలాంటి హైప్ పెంచుతారో చూడాలి.
Follow
Post a Comment