ఏషియన్ సునీల్ వరుసగా స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఇలా కొంతమంది హీరోలతో భాగస్వామ్యం చేసుకొని మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరికొందరు హీరోలు కూడా ఈ బిజినెస్ లోకి రాబోతున్నారు.
ఇక దగ్గుబాటి హీరోలు కూడా త్వరలోనే ఈ బిజినెస్ లో అడుగు పెట్టడానికి రెడీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎషియన్ క్లాసిక్ పేరుతో డ్రయివ్ ఇన్ థియేటర్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏషియన్ సునీల్ అలాగే మహేష్ బాబు ప్రధాన బిజినెస్ పాట్నర్స్ గా ఉండగా దగ్గుబాటి వెంకటేష్ అలాగే రానా దగ్గుబాటి కూడా అందులో సగం వరకు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అవుట్జున్నట్లు సమాచారం.
Follow
Post a Comment