SSMB 28: మరో రెండు కొత్త టైటిల్స్!


అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న SSMB28 సినిమా షూటింగ్ మళ్ళీ ఊపందుకుంది. ఈ చిత్రం యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు.  షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.  ఇక సినిమాకి సంబంధించిన  టైటిల్ విషయంలో చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.  


కొత్త టైటిల్స్‌లో 'అయోధ్యలో అర్జునుడు' అనేది చర్చల దశలో ఉంది. అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ పెట్టాలని త్రివిక్రమ్ ఎక్కువగా ఆలోచిస్తున్నాడట. ఇక 'అతడే తన సైన్యం' అనే మరో టైటిల్ కూడా చర్చల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు టైటిల్స్‌లో ఒకటి ఖరారు చేసి ప్రకటించనున్నారట. SSMB 28 సినిమా ఎక్కువగా తల్లి సెంటిమెంట్‌పై ఆధారపడి ఉంటుందట. ఉగాదికి ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తారని సమాచారం.  త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా విడుదల కానుంది.  పూజా హెగ్డే శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 11 విడుదల కానుంది.

Post a Comment

Previous Post Next Post