శ్రీలీల చుట్టే సితార.. 4 సినిమాల ఆఫర్స్!


సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఈ మధ్య శ్రీలీల గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం ఏడు సినిమాలు లైన్ లో ఉండగా అందులో 4 సినిమాలు సితారలోనే చేస్తుండడం విశేషం. మహేష్ బాబు 28వ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ 4వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా శ్రీలీల మేయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. అలాగే మరో ప్రాజెక్ట్ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ విధంగా శ్రీలీల గ్యాప్ లేకుండా సితార లోనే సినిమాలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

Post a Comment

Previous Post Next Post