రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలను లైన్ లో పెట్టడంతో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే విషయంలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ప్రభాస్ స్పిరిట్ కూడా ప్రత్యేకమైన బజ్ అయితే ఉంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరపైకి రాబోయే ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. ముందుగా యానిమాల్ సినిమాను సందీప్ ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేయనున్నాడు.
ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి ఇటీవల క్లారిటీ ఇచ్చిన సందీప్ రా అండ్ పవర్ ఫుల్ యాక్షన్ తరహాలో ప్రభాస్ సినిమా ఉంటుందని.. అలాంటి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా అని అందుకు అనుగుణంగానే పవర్ ఫుల్ స్టోరీనే రాస్తున్నట్లుగా తెలియజేశారు. కచ్చితంగా రిఫ్రెషింగ్ మూవీ అవుతుందని ముఖ్యంగా ఫ్యాన్స్ ఎలా ఉండాలని కోరుకుంటారో.. అంతకుమించి అనేలా సినిమాను ప్లాన్ చేస్తున్నాం.. అని సందీప్ వివరణ ఇచ్చారు.
Follow
Post a Comment